ఘనంగా మురాయిదా దర్గా ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-12-27T04:58:48+05:30 IST

నగర రవీంద్రనగర్‌లోని మురాదియా దర్గా గంధం ఉరుసు ఉత్సవాలు శనివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఘనంగా మురాయిదా దర్గా ఉత్సవాలు

కడప మారుతీనగర్‌, డిసెంబరు 26: నగర రవీంద్రనగర్‌లోని మురాదియా దర్గా గంధం ఉరుసు ఉత్సవాలు శనివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటుగా జరుగనున్న ఉత్సవాలను ఆ దర్గా పీఠాధిపతి సయ్యద్‌ మహమ్మద్‌ తాహీరుల్లాఖాద్రి చేతులమీదుగా గంధం ఊరేగింపు నిర్వహించారు. జనవికాస్‌ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు తాహిర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T04:58:48+05:30 IST