ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2020-12-14T04:56:14+05:30 IST

సగిలేరు ఒడ్డునున్న కల్వరి యేసు ప్రార్థనా మందిరంలో ఆదివారం సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సెమీ క్రిస్మస్‌ వేడుకలు
చీరలు పంపిణీ చేస్తున్న ఫాస్టర్‌

కాశినాయన డిశంబర్‌13: సగిలేరు ఒడ్డునున్న కల్వరి యేసు ప్రార్థనా మందిరంలో ఆదివారం సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిలో కేక్‌ కట్‌చేసిన అనంతరం ఫాస్టర్‌ రాజారత్నం మాట్లాడుతూ క్రీస్తు ఈలోకాన్ని రక్షించేందుకు వచ్చిన రక్షకుడన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు చీరల పంపిణీ, అన్నదా నం చేశారు. చర్చి డైరెక్టర్‌ రాజశేఖర్‌, వైస్‌ప్రెసిడెంట్‌ రమణ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:56:14+05:30 IST