రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-12-06T04:57:51+05:30 IST

రిమ్స్‌ సమీపంలోని వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ పరిశీలించారు.

రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్‌
స్టేడియాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌

కడప(మారుతీనగర్‌), డిసెంబరు 5: రిమ్స్‌ సమీపంలోని వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లా పర్యటన నేపఽథ్యంలో దివంగత సీఎం వైఎ్‌సఆర్‌, వారి తండ్రి రాజారెడ్డి విగ్రహాలను ఆయన చేతుల మీదు గా ఆవిష్కరించన్నున్నట్లు తెలిపారు. అందుకు గాను విగ్రహాల ఏర్పాటు పనులు పరిశీలించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, స్టేడియం సెకట్రరీ అజయ్‌కుమార్‌రెడ్డి, ఈసీ సభ్యులు మణికుమార్‌రెడ్డి,  మహింద్రారెడ్డి, ఏవో శ్రీనివాసులు, కోచ్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:57:51+05:30 IST