క్రికెట్‌ బుకీల వెనుక సూత్రధారులెవ్వరో తేల్చండి

ABN , First Publish Date - 2020-12-27T05:24:17+05:30 IST

ప్రొద్దుటూరులో క్రికెట్‌ బుకీలు, జూదరుల నేరాల వెనుక గల సూత్రధారులైన ప్రజాప్రతినిధులు, అవినీ తి పోలీసు అధికారులు ఎవరో తేల్చి అరెస్ట్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి డిమాండ్‌ చేశారు.

క్రికెట్‌ బుకీల వెనుక సూత్రధారులెవ్వరో తేల్చండి
సమావేశంలో మాట్లాడుతున్న వరదరాజులరెడ్డి

   మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు అర్బన్‌, డిసెంబరు 26: ప్రొద్దుటూరులో క్రికెట్‌ బుకీలు, జూదరుల నేరాల వెనుక గల సూత్రధారులైన ప్రజాప్రతినిధులు, అవినీ తి పోలీసు అధికారులు ఎవరో తేల్చి అరెస్ట్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం స్ధానిక ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల విచారణలో క్రికెట్‌ బుకీలకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయని తేలిందో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. 34 కోట్ల టర్నోవర్‌లో ప్రజాప్రతినిధులు, అవినీతి పోలీసు అధికారులకు ఎంత వాటా ఉందో బహిరంగపరిచి వారిని అరెస్ట్‌ చేయాలని కేవలం కొందరు సామాన్యులను అరెస్ట్‌ చేసినంతమాత్రాన నేరాలను అడ్డుకోలేరన్నారు. ఇంతకాలం ప్రొద్దుటూరులో పనిచేస్తున్న పోలీసుఅధికారులకు తెలియకుండా మట్కా, క్రికెట్‌ బెట్టింగ్‌ జరిగిందని జిల్లా పోలీసు అధికారులు నిర్ధారించగలరా? అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గోపిరెడ్డి చంద్రశేకర్‌ రెడ్డి,పల్లా శంకర్‌, భారత్‌ బేపారిగౌస్‌ లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:24:17+05:30 IST