-
-
Home » Andhra Pradesh » Kadapa » covid vaccine committee
-
వ్యాక్సిన్ విధి విధానాలు పాటించాలి
ABN , First Publish Date - 2020-12-20T05:01:13+05:30 IST
కొవిడ్-19 వ్యాక్సిన్ విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలని కమిషనరు సుబ్బారావు తెలిపారు.

కడప (ఎడ్యుకేషన్), డిసెంబరు 19 : కొవిడ్-19 వ్యాక్సిన్ విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలని కమిషనరు సుబ్బారావు తెలిపారు. వ్యాక్సిన్ అబ్జర్వేషన్ రూంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. కడప కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం కొవిడ్-19 వ్యాక్సిన్ సన్నద్ధ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్-19 వ్యాక్సిన్ ఐదు దశల్లో పరిశీలన జరుగుతుందన్నారు. ఐదు బృందాల పర్యవేక్షణలో వ్యాక్సిన్ ఇవ్వబడుతుందన్నారు. ఈ కమిటీకి కమిషనరు చైర్మన్‌గా, డీఎంహెచ్‌వో, ఎంఈవో, తహసీల్దారుతో పాటు పలువురు కమిటీ సభ్యులుగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎంఈవో నారాయణ, సీఐ సత్యనారాయణ, ఎంహెచ్‌వో వినోద్‌కుమార్ డీటీ శంకర్, తదితరులు పాల్గొన్నారు.