-
-
Home » Andhra Pradesh » Kadapa » Covid rules must be new year day DSP
-
నిబంధనలు పాటించకుంటే చర్యలే : డీఎస్పీ
ABN , First Publish Date - 2020-12-31T04:52:45+05:30 IST
నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు ఉల్లఘించి రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు.

పులివెందుల టౌన, డిసెంబరు 30: నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు ఉల్లఘించి రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు.
బుధవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్ -19 కారణంగా పులివెందు ల సబ్ డివిజన పరిధిలో నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు రోడ్లపై తిరగడం గానీ, పార్టీలు, కేక్ కటింగ్‌లు చేయడం గానీ, మోటర్ సైకిళ్లకు సైలెన్సర్లు తీసివేసి నడపడం గానీ, మద్యం తాగి అల్లరి చేయడం గాని, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వంటి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు.
వీటిని ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. చర్చిలకు, ఆలయాలకు, మసీదులకు నిబంధనలకు లోబడి ప్రార్థనలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.