మిడ్ లెవల్ ప్రొవైడర్స్ కౌన్సెలింగ్ వాయిదా
ABN , First Publish Date - 2020-12-04T05:09:08+05:30 IST
వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న మిడ్ లెవల్ ప్రొవైడర్స్ కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది.

కడప(కలెక్టరేట్), డిసెంబరు 3: వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న మిడ్ లెవల్ ప్రొవైడర్స్ కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. ప్రాంతీయ పరిధిలో ప్రస్తుతం గతేడాది ఎంపికైన 113 మందిని కొవిడ్ కారణంగా నేరుగా నియమించారు. వారందరికీ జరగాల్సిన 3వ విడత కౌన్సెలింగ్ ప్రక్రియను పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం ప్రాంతీయ సంచాలకురాలు డా.మీనాకుమారి చేట్టారు. అయితే ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న తమకు కూడా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇవ్వాలని పలువురు మిడ్ లెవల్ ప్రొవైడర్లు కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ మేరకు వెంటనే కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు. వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.