ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి

ABN , First Publish Date - 2020-04-12T09:15:49+05:30 IST

కరోనా వైరస్‌ కంటికి కనిపించేది కాదు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి

ఓబులవారిపల్లె, ఏప్రిల్‌ 11 : కరోనా వైరస్‌ కంటికి కనిపించేది కాదు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మంగంపేట పంచాయతీ కార్యాలయంలో పునరావాస కాలనీలోని 2వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం సీనియర్‌ వైసీపీ నాయకులు గుత్తిరెడ్డి హరినాధరెడ్డి చేపట్టారు. నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ మిఽథున్‌రెడ్డితో పాటు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హాజరయ్యారు.


ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ సాయికిశోర్‌రెడ్డి, యువ పారిశ్రామిక వేత్తలు కౌలూరి మధుసూదన్‌రెడ్డి, పోతుల లక్ష్మీనారాయణ, కొటారు వెంకటరమణ, గల్లా నారాయణ, మురళీ, రైల్వేకోడూరు సీఐ ఆనందరావు, ఓబులవారిపల్లె ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌, తహసీల్దారు తుమ్మాది ఈశ్వరయ్య, సీడీ నాగేంద్ర, దేవకుమార్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


దాతలకు ధన్యవాదాలు 

ఓబులవారిపల్లె, ఏప్రిల్‌11 : లాక్‌డౌన్‌లో పూటగడవని దళిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు ధన్యవాదాలని రైల్వేకోడూరు శాసన సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. 


శనివారం గోవిందంపల్లెలో దక్షిరాజు చంద్రరాజు, ఉప్పలపాటి సుబ్బరాజు అనే రైతులు బియ్యంతో పాటు నిత్యావసరవస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే కొరముట్ల, వైసీపీ మండల కన్వీనర్‌ సాయికిషోర్‌రెడ్డి,  వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సి.డి.నాగేంద్ర, వైసీపీ సీనియర్‌ నాయకులు హేమనవర్మ, పంజం సుకుమార్‌రెడ్డి, ఎంపీటీసీ రమే్‌షరాజు, సురేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-04-12T09:15:49+05:30 IST