కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-05-19T11:18:28+05:30 IST
రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రైల్వేకోడూరుకు చెన్నై నుంచి వచ్చిన వలస కూలీలకు పరీక్షలు

చిట్వేలి, కోడూరులో పాజిటివ్ కేసులు
రాజంపేట, మే18 : రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రైల్వేకోడూరుకు చెన్నై నుంచి వచ్చిన వలస కూలీలకు పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. చెన్నై నుంచి చిట్వేలికి వచ్చిన రాజస్థాన్ వాసులలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
వీరిరువురిని, వారితో పాటు ఉన్న వారిని కడప క్వారంటైన్‌కు పంపారు. కాగా.. నందలూరుకు చెందిన ఓ మహిళ పూణాలో క్యాన్సర్‌తో మృతి చెందింది. ఆమెకు కరోనా పాజిటివ్ ఉందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా అంత్యక్రియలు చేసేందుకు నందలూరు మండలం ఆడపూరుకు సంబంధించిన గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, ఒంటిమిట్ట సీఐ హనుమంతునాయక్, నందలూరు ఎస్ఐ తదితరులు అక్కడికి చేరుకొని గ్రామస్తులకు సర్దిచెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెను తీసుకొచ్చిన అంబులెన్స్‌లో ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు.