-
-
Home » Andhra Pradesh » Kadapa » Corona distance with hands clean
-
చేతుల శుభ్రతతో కరోనా దూరం
ABN , First Publish Date - 2020-03-25T10:00:38+05:30 IST
ప్రతిఒక్కరూ చేతులు శుభ్రం పాటించి కరోనాను దూరం చేయాలని ఎస్‌ఐ రాజారెడ్డి అన్నారు. కమలాపురంలో ఏపీయూడబ్ల్యూజే

కమలాపురం, మార్చి 24: ప్రతిఒక్కరూ చేతులు శుభ్రం పాటించి కరోనాను దూరం చేయాలని ఎస్‌ఐ రాజారెడ్డి అన్నారు. కమలాపురంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విలేకరులు చేతుల శుభ్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని, ఆటో, ద్విచక్ర వాహనంతో సహా ఏ వాహనంలో కారణం లేకుండా బయట తిరిగినా చట్టపరమైన చర్యలుంటాయని, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.