కడప జిల్లాలో కొత్తగా 585మందికి పాజిటివ్.. మరో ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2020-09-14T17:46:57+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన..

కడప జిల్లాలో కొత్తగా 585మందికి పాజిటివ్.. మరో ఆరుగురి మృతి

కడప(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం జిల్లా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం కొత్తగా 585 మందికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా బా ధితుల సంఖ్య 36,646కు చేరింది. ఆరుగురు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 377కు పెరిగింది. తాజాగా 5794 మంది నుంచి కరోనా శాంపిల్స్‌ సేకరించారు. ప్రస్తుతం రిమ్స్‌ జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి పాతిమా మెడికల్‌ కళాశాల, ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రితో పాటు అయా కొవిడ్‌ సెంటర్లల్లో 1655 మంది చికిత్స పొందుతున్నారు. 4,701 కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. సోమవారం కడప, ప్రొద్దుటూరు, నల్లపురెడ్డిపల్లి, సీకే దిన్నె, రాజుపాలెం మండలాల్లో సంజీవని బస్సుల ద్వారా కరోనా శాంపిల్స్‌ సేకరించనున్నారు. 


Updated Date - 2020-09-14T17:46:57+05:30 IST