ప్రజా సహకారంతోనే కరోనా కట్టడి

ABN , First Publish Date - 2020-05-11T11:36:34+05:30 IST

ప్రజల సహకారంతోనే కరోనా వైరస్‌ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రజా సహకారంతోనే కరోనా కట్టడి

ప్రొద్దుటూరు క్రైం, మే 10 : ప్రజల సహకారంతోనే కరోనా వైరస్‌ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మున్పిపల్‌ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించి కరోనా రహిత ప్రొద్దుటూరుకు ప్రజలు సహకరించాలన్నారు. పాడిరైతులకు తాను వ్యతిరేకం కాదని, డ్రమ్ముపాల విక్రయాల కోసం పల్లెల నుంచి వచ్చే వ్యాపారులు కరోనా బారిన పడే అవకాశం ఉందని దీనిని నివారించేందుకు డ్రమ్ము పాల వ్యాపారులను అనుమతివ్వలేదన్నారు. అంతేగాకుండా మాంసం విక్రయాల వల్ల ప్రజలు గుంపులుగా చేరడం వల్ల కూడా  విక్రయాలను నిలిపేశామన్నారు. ఈ విషయంలో వ్యా పారులు కూడా సహకరించాలని ఎమ్మెల్యే రాచమల్లు కోరారు. 

Updated Date - 2020-05-11T11:36:34+05:30 IST