మరో 37 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-11-26T05:41:16+05:30 IST

జిల్లాలో 24 గంటల వ్యవధిలో మరో 37 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది.

మరో 37 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, నవంబరు 25 (ఆంద్రజ్యోతి): జిల్లాలో 24 గంటల వ్యవధిలో మరో 37 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,356కు చేరుకుంది. ఇప్పటి వరకు 520 మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 50 మందిని డిశ్చార్జి చేశారు. 53,547 మంది కోలుకున్నారు. 355 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.


Updated Date - 2020-11-26T05:41:16+05:30 IST