కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2020-12-08T05:05:04+05:30 IST

కోడూరు నియోజకవర్గంలో కాంగ్రె్‌సపార్టీని బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలి

రైల్వేకోడూరు, డిసెంబరు, 7: కోడూరు నియోజకవర్గంలో కాంగ్రె్‌సపార్టీని బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం కడప పార్టీ కార్యాలయంలో రైల్వేకోడూరు మండల పార్టీ అధ్యక్షుడు రాజబోయిన శ్రీకాంత్‌, కాంగ్రెస్‌ పార్టీ నేతలు బొమ్ము చెంగయ్య, తెల్లపాటి సత్యనారాయణ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి పార్టీ రావాలంటే ఇప్పటి నుంచే ప్రజలకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు.

Updated Date - 2020-12-08T05:05:04+05:30 IST