పరిహారంపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా..?

ABN , First Publish Date - 2020-12-02T04:43:37+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల పరిహారం గురించి అసెంబ్లీలో ప్రశ్నిస్తే చంద్రబాబునాయుడు సహా 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం ఏమిటని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు.

పరిహారంపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా..?
సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 1 : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల పరిహారం గురించి అసెంబ్లీలో ప్రశ్నిస్తే చంద్రబాబునాయుడు సహా 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం ఏమిటని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ సుధీర్ఘకాలం సీఎంగా సేవలందించిన చంద్రబాబును మంత్రి కొడాలి నాని దిగజారిపోయి దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం సమక్షంలోనే ఇంత జరుగుతున్నా నవ్వులాటగా చూస్తుండడం దారుణమన్నారు. ఆ స్థానంలో  జగన్‌ కాకుండా మరో సీఎం ఉండి ఉంటే మంత్రి నానిని ఆ పదవి నుంచి వెంటనే భర్తరఫ్‌ చేసి ఉండేవారన్నారు. మెజారిటీతో కన్నుమిన్ను కాకుండా వైసీపీ మాట్లాడుతున్నారని ఈ అధికారం శాశ్వితం కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రైతులకు పంట నష్టపరిహారం విషయంలో న్యాయం జరిగేవరకు టీడీపీ నేతలు పోరాడుతూనే ఉంటారన్నారు.  పంటల బీమా కడతామని చెప్పి, కట్టకపోవడం వల్లనే రైతులు రూ.4వేల కోట్లు నష్టపోయారని దీనికి ఎవ్వరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో టీడీపీ నాయకులు సీతారామిరెడ్డి, బాలయ్య, శేషయ్య, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T04:43:37+05:30 IST