పులివెందులకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌

ABN , First Publish Date - 2020-10-03T19:44:11+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు.

పులివెందులకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌

కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పులివెందులకు చేరుకుని అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మామ గండిరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కాగా.. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్ భారతీరెడ్డి తండ్రి (సీఎం జగన్‌ మామ) డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇవాళ పులివెందులలో గంగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. 


అంత్యక్రియలకు పెద్ద ఎత్తున గంగిరెడ్డి అభిమానులు, అనుచరులు, బంధువులు తరలివచ్చారు. తమ అభిమాన డాక్టర్‌ను కడసారి చూసేందుకు కదిలారు. జగన్ కంటే ముందుగా తాడేపల్లి నుంచి వైఎస్‌ విజయలక్ష్మి పులివెందులకు బయలుదేరారు. మరోవైపు.. ఈసీ గంగిరెడ్డి మృతిపట్ల గవర్నర్ బిశ్వభూషణ్ కూడా సంతాపం తెలిపారు. వైద్యులుగా ఆయన ఎనలేని సేవలు అందించారని గవర్నర్ కొనియాడారు.

Updated Date - 2020-10-03T19:44:11+05:30 IST