-
-
Home » Andhra Pradesh » Kadapa » cm tadepalle chiefvif prakatanalu
-
సీఎం తాడేపల్లెకు.. చీఫ్‌విప్ ప్రకటనలకు పరిమితం
ABN , First Publish Date - 2020-12-11T04:58:31+05:30 IST
రాష్ట్రంలో తుఫాన్లకు రైతులు అల్లాడుతుంటే పరిష్కార చర్యలు తీసుకోలేని సీఎం జగన్ తాడేపల్లెకు పరిమితం కాగా చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.

హెక్టారుకు రూ.40వేలు పంట నష్టం పరిహారం ఇవ్వాలి: శ్రీనివాసరెడ్డి
గాలివీడు, డిసెంబరు10: రాష్ట్రంలో తుఫాన్లకు రైతులు అల్లాడుతుంటే పరిష్కార చర్యలు తీసుకోలేని సీఎం జగన్ తాడేపల్లెకు పరిమితం కాగా చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం అరవీడు గ్రామంలోని కుషావతి ప్రాజెక్టును, వర్షాలకు దెబ్బతిన్న వరిపైరును, కల్వర్టులను పరిశీలించారు. యల్లంపల్లెలోని కారాలగుట్ట కార్మికులు మైనింగ్ లీజుపై ఆయన దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించి తహసీల్దార్‌కు ఫోన్ ద్వారా కారాలగుట్ట మైనింగ్ లీజుకు ఇవ్వద్దని సూచించారు. తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలకు హెక్టారుకు రూ.40 వేలు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలోనే జగన్‌లాంటి ఫేక్ సీఎం ఎక్కడా లేరన్నారు. దివంగత మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి జీవితాశయమే వెలిగల్లు ప్రాజెక్టు నిర్మాణమన్నారు. అంతకు ముందు పూలకుంట గ్రామంలోని రాజంపేట పార్లమెంట్ రైతు విభాగం కార్యదర్శి పార్థసారధిరెడ్డి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో పులివెందుల మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పార్థసారధిరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, టీడీపీ కార్యాలయ కార్యదర్శి వెంకటశివారెడ్డి, వక్ఫ్‌బోర్డు మాజీ మెంబరు మహబూబ్‌బాషా, మాజీ సర్పంచులు ఈశ్వర్‌రెడ్డి, చిన్నపరెడ్డి, రాష్ట్ర గాండ్ల సంఘం మాజీ డైరక్టర్ రుద్రగోపి, సత్యారెడ్డి, డాక్టర్ రామచంద్రారెడ్డి, రామ్మోహన్‌నాయుడు, బీసీ నాయకులు సుబ్బయ్య, రమణయ్య పాల్గొన్నారు.