కోర్‌జోన్‌లో మూతబడ్డ వైన్‌ షాప్‌

ABN , First Publish Date - 2020-06-19T06:32:26+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు గల కోర్‌జోన్‌ ప్రాంతంలో ఎట్టకేలకు అధికారులు వైన్‌షా్‌పను మూయించారు. మైదుకూరు పట్టణ శివారులోని ఓ కాలనీలో

కోర్‌జోన్‌లో మూతబడ్డ వైన్‌ షాప్‌

ఆంధ్రజ్యోతికి స్పందన 


మైదుకూరు, జూన్‌ 18 : కరోనా పాజిటివ్‌ కేసులు గల కోర్‌జోన్‌ ప్రాంతంలో ఎట్టకేలకు అధికారులు వైన్‌షా్‌పను మూయించారు. మైదుకూరు పట్టణ శివారులోని ఓ కాలనీలో నివాసముంటున్న దంపతులకు  కరోనా పాజిటివ్‌ రావడంతో అక్కడ 200 మీటర్ల వరకు కట్టుదిట్టం చేసి కోర్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. వైన్‌షాపుకు ఇరు పక్కల వీధులకు రాకపోకలు సాగకుండా అధికారులు  బారికేడ్లు కట్టారు. అయితే మధ్యలో ఉన్న వైన్‌షాపు మాత్రం ఎటువంటి ఆంక్షలు లేకుండా మందు అమ్మకాలు సాగిస్తున్న విషయంపై ఆంధ్రజ్యోతిలో ‘కోర్‌జోన్‌ మార్గమందున..!’ అనే శీర్షికతో ప్రముఖంగా ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ సీఐ వెంకట్‌ గురువారం వైన్‌షాపును మూయించారు. 

Updated Date - 2020-06-19T06:32:26+05:30 IST