దాతృత్వం అభినందనీయం

ABN , First Publish Date - 2020-05-10T07:18:25+05:30 IST

పేదలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ముందుకు వచ్చిన దాతల దాతృత్వం అభినందనీయమని ప్రభు త్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

దాతృత్వం అభినందనీయం

రాయచోటిటౌన్‌, మే 9: పేదలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ముందుకు వచ్చిన దాతల దాతృత్వం అభినందనీయమని ప్రభు త్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన సయ్యద్‌ సాహెబ్‌పీర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 200 మంది పేద కుటుంబాలకు మాజీ కౌన్సిలర్‌ దశరథరామిరెడ్డితో కలిసి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అలాగే జమ్‌జమ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 1000 పేద కుటుంబాలకు 17 రకాల నిత్యావసర సరుకులు, 300 మంది మహిళలకు చీరలను చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.


అలాగే దాత ప్రసాద్‌నాయుడు ఆర్థిక సహకారంతో రాయచోటి లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో 80 మంది పోలీసు, ఆర్టీసీ, మున్సిపల్‌ సిబ్బందికి అల్పాహారం, వాటర్‌బాటిళ్లను పంపిణీ చేశారు. అలాగే మండల ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాం బాబు, తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యంరెడి ్డ, అర్బన్‌ సీఐ రాజుల ఆధ్వర్యంలో వలస కార్మికులకు బియ్యం,నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెన్నూరు అన్వర్‌బాషా, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ఆసి్‌ఫఅలీఖాన్‌, వైసీపీ నేతలు హబీబుల్లాఖాన్‌, కొలిమి చాన్‌బాషా, రియాజ్‌, ఇర్ఫాన్‌, మురళీమోహన్‌రెడ్డి, జమీల్‌, అతావుల్లా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-10T07:18:25+05:30 IST