వామ్మో... చిరుతలు

ABN , First Publish Date - 2020-12-30T05:13:47+05:30 IST

సురభి గ్రామంలో రెండు రోజులుగా ఒక చిరుత, నాలుగు పిల్లలు సంచరిస్తున్నట్లు ప్రజలు తెలిపారు.

వామ్మో... చిరుతలు
రోడ్డుపై గుంపులుగా వెళుతున్న నెమళ్లు

భయాందోళనలో ప్రజలు 

చక్రాయపేట, డిసెంబరు 29: సురభి గ్రామంలో రెండు రోజులుగా ఒక చిరుత, నాలుగు పిల్లలు సంచరిస్తున్నట్లు ప్రజలు తెలిపారు. రెడ్డివా రి పల్లె, బీటీపల్లె, గాజులపేట, కుప్పగుట్టపల్లె ప్రాంతాల మామిడితోట ల్లో చిరుతలు సంచారం చేయడంతో రైతులు పొలాల్లోకి వెళ్లలేకపోతు న్నారు. ఎక్కడ దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఫారెస్టు అధికారులకు తెలియజేస్తే వారు  గాలిస్తున్నట్లు తెలిపారు.

గుంపులుగా నెమళ్లు...

మండలంలోని పలు గ్రామాల్లో నెమళ్లు గుంపు లుగా వెళుతు న్నాయి. కె ఎర్ర గుడి గ్రామం దేశాయ్‌ మాధ వరెడ్డి ఎస్టేట్‌ చిలేకాంపల్లె గ్రామం గొంది పల్లె వద్ద నెమళ్లు మందల్లా కనిపిస్తున్నాయి. ఇది వరకు ఎన్నడూ ఇలా చూడలేదని రైతులు అంటున్నారు. మనుషులు దగ్గరికెళ్లినా భయపడడంలేదని, రోడ్డుపైనే నెమ్మదిగా వెళ్తున్నాయి.

Updated Date - 2020-12-30T05:13:47+05:30 IST