-
-
Home » Andhra Pradesh » Kadapa » check to upadi works
-
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
ABN , First Publish Date - 2020-12-29T05:11:53+05:30 IST
మహాత్మాగాంఽధీ జాతీయ ఉపాధి హామీ 2019-20 సంవత్సరానికిగాను చేపట్టిన పనులపై సోమవారం సామాజిక తనిఖీ నిర్వహించారు.

బ్రహ్మంగారిమఠం, డిసెంబరు 28: మహాత్మాగాంఽధీ జాతీయ ఉపాధి హామీ 2019-20 సంవత్సరానికిగాను చేపట్టిన పనులపై సోమవారం సామాజిక తనిఖీ నిర్వహించారు. 750 పనులపై మొత్తం రూ.6,83,39, 470 ఖర్చు చేసినట్లు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ మద్దిలేటి తెలిపారు. ఈ సందర్భంగా 11 పంచాయతీల్లో చేపట్టిన పనులపై సోషల్ ఆడిట్ సిబ్బం ది నివేదికలను చదివి వినిపించారు. ఇందులో భాగంగా రూ.13, 345 రికవరీ చేయాలన్నారు. కాగా వాటర్‌షెడ్ జీవనోపాదులకు సంబంధిం చిన రూ.25.40 లక్షలకు రికార్డులను ఆడిట్ అధికారులకు చూపించలేద న్నారు. మండల ప్రత్యేక అధికారి సూర్యప్రకాష్‌రావు, జేఈఓ రమణారెడ్డి, ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, ఏపీఓ వసంతకుమార్ పాల్గొన్నారు.