రాజధానిపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి: టీడీపీ

ABN , First Publish Date - 2020-12-18T05:04:12+05:30 IST

రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని టీడీపీ రైల్వేకోడూరు ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు డిమాండ్‌ చేశారు.

రాజధానిపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి: టీడీపీ
రైల్వేకోడూరులో దీక్ష చేపడుతున్న టీడీపీ నాయకులు

రైల్వేకోడూరు, డిసెంబరు, 17: రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని టీడీపీ రైల్వేకోడూరు ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు డిమాండ్‌ చేశారు. అమరావతి ఉద్యమం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా గురువారం స్థానిక టోల్గేట్‌ వద్ద టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మా శివ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కస్తూరి మాట్లాడుతూ వైసీపీది రెండు నాల్కుల ధోరణి అన్నారు. మూ డు రాజధానుల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. విశాఖలో పరిపాలన, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టు.. ఇలా ఎన్ని పెడతారని ప్రశ్నించారు. అమరావతి రైతులు రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నేత మాచినేని విశ్వేశ్వరనాయుడు, టీడీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి పీకే నా యుడు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ దుద్యాల జయచంద్ర, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు చిగురుపాటి ధనుంజయనాయుడు, కోడూరు జనార్దన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-18T05:04:12+05:30 IST