చలమారెడ్డి మృతి బీజేపీకి తీరనిలోటు

ABN , First Publish Date - 2020-12-11T05:10:57+05:30 IST

బీజేఎంఎం రాయలసీమ ఇన్‌ఛార్జ్‌ కేవీ చలమారెడ్డి మృతి బీజేపీకి తీరనిలోటని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రా జు, జాతీయ నాయకు డు విష్ణువర్ధన్‌రెడ్డిలు పేర్కొన్నారు.

చలమారెడ్డి మృతి బీజేపీకి తీరనిలోటు
చలమారెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు

కడప(సిటీ), డిసెంబరు 10:  బీజేఎంఎం రాయలసీమ ఇన్‌ఛార్జ్‌ కేవీ చలమారెడ్డి మృతి బీజేపీకి తీరనిలోటని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రా జు, జాతీయ నాయకు డు విష్ణువర్ధన్‌రెడ్డిలు పేర్కొన్నారు.  గురువారం వారు కడపలోని చలమారెడ్డి ఇంటికి వెళ్లి  ఆయన నివాస గృ హంలో ఉంచిన భౌతిక కాయా న్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. బీజేపీ ఓ మంచి నాయకున్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కేవీ చలమారెడ్డి మృతదేహాన్ని టీడీపీ నేతలు బి.హరిప్రసాద్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ శ్రీను, బీజేపీ సీనియర్‌ నాయకుడు శశిభూషణ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి, బీజేపీ కిసాన్‌మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ నేత సుభాన్‌బాషా తదితరులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం సాయంత్రం చలమారెడ్డి సొంత గ్రామమైన తొండూరు మండలం సంతకొవ్వూరులో అంత్యక్రియ లు నిర్వహించారు. అక్కడ చలమారెడ్డి మృతదేహాన్ని వైసీపీ నేతలు వైఎస్‌ భాస్కరరెడ్డి, బలరామిరెడ్డిలు సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

కందుల  కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేతలు

కడప (మారుతీనగర్‌), డిసెంబరు 10: ఇటీవల మృతి చెందిన కడప మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ కందుల శివానందరెడ్డి కుటుంబాన్ని గురువారం బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు సో ము వీర్రాజు పరామర్శించారు. కడప పర్యటనలో భాగంగా ఆయన కందుల స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రమే్‌షనాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:10:57+05:30 IST