సీసీ కెమెరాలు ఏర్పాటు
ABN , First Publish Date - 2020-12-31T04:50:18+05:30 IST
సురభిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ సత్యానందం తెలి పారు.

చక్రాయపేట, డిసెంబరు 30: సురభిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తహసీల్దార్ సత్యానందం తెలి పారు. గ్రామంలో చిరుతలు సంచరిస్తున్నాయని పత్రి కల్లో కథనాలు ప్రచురితమవడంతో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తహసీల్దార్ సూచిం చారు.
గ్రామంలో అధికారులు పరిశీలించి అవి చిరుత లో లేక తోడేల్లో, గుంటనక్కలో తేల్చాల్సి ఉందన్నారు. అందు కోసం నాలుగైదు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తు న్నట్లు ఫారెస్టు అధికారులు ప్రకటించారన్నారు. రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని తెలిపారు.
గృహాల లబ్ధిదారులకు మారెళ్లమడక వద్ద ఇసుక రీచలు ఏర్పాటు చేయనున్నామని, ఇసుక ఎక్కడున్నా గుర్తించి ఆ రీచ్ ద్వారా ఇసుక సరఫరా చేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.