వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీఐ

ABN , First Publish Date - 2020-11-22T04:56:03+05:30 IST

బంగారు దుకాణదారులు, ఇతర వ్యాపారులు వారి దుకాణాలతో పాటు షాపుల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కడప అర్బన్‌ సీఐ మహ్మద్‌ ఆలీ సూచించారు.

వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీఐ

కడప (క్రైం), నవంబరు 21 : బంగారు దుకాణదారులు, ఇతర వ్యాపారులు వారి దుకాణాలతో పాటు షాపుల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కడప అర్బన్‌ సీఐ మహ్మద్‌ ఆలీ సూచించారు. కడప నగరం బీకేఎం స్ర్టీట్‌లోని వ్యాపారులతో శనివారం సా యంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దుకాణాల లోపల సీసీకెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల దొంగత నాలు జరిగితే గుర్తించవచ్చన్నారు. కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు షాపు యాజమాన్యంతో పాటు అక్కడ పనిచేసేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్ద దుకాణదారులు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకుంటే మంచిదన్నారు. బంగారు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

Read more