ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌లకు నగదు రివార్డు

ABN , First Publish Date - 2020-04-15T09:51:22+05:30 IST

కడప నగరం మృత్యుంజయకుంటలోని గంగమ్మ దేవాలయం వద్ద మంగళవారం చెన్నకేశవ అనే వ్యక్తి మూర్చవ్యాధితో తీవ్ర

ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌లకు నగదు రివార్డు

కడప (క్రైం), ఏప్రిల్‌ 14 : కడప నగరం మృత్యుంజయకుంటలోని గంగమ్మ దేవాలయం వద్ద మంగళవారం చెన్నకేశవ అనే వ్యక్తి మూర్చవ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు 108కు ఫోన్‌ చేయడంతో ఆ వాహనం అందుబాటులో లేకపోవడంతో  చిన్నచౌకు ఎస్‌ఐ రోషన్‌ హుటాహుటిన తన జీపులో తీసుకెళ్లి రిమ్స్‌లో చేర్పించి వైద్య సేవలు చేయించారు. అలాగే సోమవారం ఓం శాంతినగర్‌లో ఓ మహిళను సకాలంలో చికిత్స జరిగేలా చొరవ తీసుకున్న ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటసుబ్బయ్య, ఎస్‌ఐ రోషన్‌లను ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. 

Updated Date - 2020-04-15T09:51:22+05:30 IST