జేసీ కుటుంబంపై కేసులు పెట్టడం దారుణం : రెడ్యం

ABN , First Publish Date - 2020-12-27T05:01:08+05:30 IST

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్డడం దారుణమని తాడిపత్రి, అనంతపురం టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు

జేసీ కుటుంబంపై కేసులు పెట్టడం దారుణం : రెడ్యం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రెడ్యం

కడప, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్డడం దారుణమని తాడిపత్రి, అనంతపురం టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి  ధ్వజమెత్తారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జేసీ ఇంటికి ప్రస్తుత శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి మందీ మార్బలంతో, మారణాయుధాలతో వెళ్లి కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌ను చితకబాది, జేసీతో పాటు జేసీ అస్మిత్‌రెడ్డి తదితరులపై కేసులు పెట్టడం బాధాకరమన్నారు. వాస్తవాలు  కనిపిస్తుంటే వాటి దాచి జేసీ కుటుంబంపై కేసులు బనాయించడం వైసీపీ మార్క్‌ నీచ రాజకీయమన్నారు. ఆ కేసులను ఎత్తివేసి బాధ్యులైన వైసీపీ నేతలందరిపై తక్షణం కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.  టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు షేక్‌ జిలానీబాషా, బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మాసాకోదండరామ్‌, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు జింకా శ్రీను, 26వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మాసాపేట శివ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:01:08+05:30 IST