ఇరువురిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-12-02T04:51:14+05:30 IST

కడప ఎన్జీవో కార్యాలయం తాళాలు పగలగొట్టి అక్రమంగా ప్రవేశించి ప్రమాణ స్వీకారం చేసిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు.

ఇరువురిపై కేసు నమోదు

కడప (క్రైం), డిసెంబరు 1 : కడప ఎన్జీవో కార్యాలయం తాళాలు పగలగొట్టి అక్రమంగా ప్రవేశించి ప్రమాణ స్వీకారం చేసిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు. సీఐ వివరాల మేరకు... డీఎంహెచ్‌వో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్న రమే్‌షకుమార్‌, సుబ్బారెడ్డి మరికొందరితో కలిసి గతంలో ఏపీఎన్జీవో అధ్యక్ష పదవీ కాలం అయిపోయిందంటూ కార్యాలయాల తాళాలు పగలగొట్టి అక్కడ ఇరువురూ ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలిపారు. ఈ విషయమై ఏపీ ఎన్జీవో నాయకుడు శివారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-12-02T04:51:14+05:30 IST