-
-
Home » Andhra Pradesh » Kadapa » cancel anti agri actions
-
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-29T05:15:37+05:30 IST
వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి భైరవ ప్రసాద్ అన్నారు.

పోరుమామిళ్ల, డిసెంబరు 28 : వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి భైరవ ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. భైరవ ప్రసాద్ మాట్లాడుతూ ఢిల్లీలో గజగజా వణికే చలిని కూడా లెక్క చేయకుండారైతులు దీక్షలు చేస్తున్నా మోదీ సర్కారు పట్టించుకోకపోవడం ఏమిటన్నా రు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ చట్టాలను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా సంఘం నాయకురాలు వరలక్షుమ్మ, అన్నపూర్ణమ్మ, వెంకటలక్షుమ్మ పాల్గొన్నారు.