ఘనంగా అంబేడ్కర్‌ వర్ధంతి

ABN , First Publish Date - 2020-12-07T04:40:02+05:30 IST

బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆదివారం రైల్వేకోడూరులోని ఆయన విగ్రహానికి రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.

ఘనంగా అంబేడ్కర్‌ వర్ధంతి
రైల్వేకోడూరు లో నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు

రైల్వేకోడూరు, డిసెంబరు, 6:  బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆదివారం రైల్వేకోడూరులోని ఆయన విగ్రహానికి రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అలాగే దళిత సేవా సంఘం అధ్యక్షుడు మద్దెల వెంకటసుబ్బయ్య, సామాజిక సేవా కార్యకర్త మందపాటి శంకరయ్య, కోడూరు మండల అధ్యక్షుడు పెయ్యల సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ గోశాల దేవి, జిల్లా నాయకులు శాంతయ్య, మండల పార్టీ అధ్యక్షులు రాజబోయిన శ్రీకాంత్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు వెంబడి రాధాక్రిష్ణ, దళిత సంఘాలు, ఏపీ ముస్లిం వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఉపాధ్యక్షుడు సయ్యద్‌ ఖలీల్‌, ముస్లిం లీగ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు జుబేర్‌, హ్యూమన్‌ వెల్ఫేర్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌. సిరాజ్‌, టీడీపీ దళిత నాయకుడు తేనేపల్లె చిన్నా, రమేష్‌ తదితరులు అంబేడ్కర్‌ కు ఘనంగా నివాళి అర్పించారు. వైసీపీ మైనార్టీ నేత ఆదాంసాహెబ్‌, పట్టణ అధ్యక్షుడు సీహెచ్‌ రమే్‌షబాబు, వైసీపీ నాయకులు బండారు మల్లికార్జున, శ్రీకారపు శివయ్య, మండల పార్టీ అధ్యక్షుడడు గుంటిమడుగు సుధాకర్‌రాజు, మాల మహానాడు నాయకుడు తుమ్మల సురేష్‌,  నాయకురాళ్లు శారదమ్మ, పుష్పలత, లక్ష్మీనారాయణమ్మ  పాల్గొన్నారు.

Read more