పాఠశాలకు వెళ్లడం లేదని.. తల్లిదండ్రులు మందలించడంతో..

ABN , First Publish Date - 2020-12-16T05:18:32+05:30 IST

మండల కేంద్రమైన దువ్వూరుకు చెందిన మహబూబ్‌బాష అనే బాలుడు గత రెండు రోజులుగా కనిపించలేదని తల్లిదండ్రులు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పాఠశాలకు వెళ్లడం లేదని.. తల్లిదండ్రులు మందలించడంతో..
మహబూబ్‌ బాష

బాలుడి అదృశ్యం


దువ్వూరు, డిసెంబరు 15: మండల కేంద్రమైన దువ్వూరుకు చెందిన మహబూబ్‌బాష అనే బాలుడు గత రెండు రోజులుగా కనిపించలేదని తల్లిదండ్రులు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు సరిగా వెళ్లలేకపోవడంతో తల్లిదండ్రులు మందలించడంతో మహబూబ్‌బాష రెండు రోజులుగా ఇంటికి రాలేదు. దీంతో సోమవారం దువ్వూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ కుళాయప్ప తెలిపారు.


కలసపాడులో బాలిక...

కలసపాడు, డిసెంబరు 15 :మండల కేంద్రమైన కలసపాడుకు చెందిన ఆటో డ్రైవరు వెంకటరమణ కుమార్తె వెంకటలక్ష్మి (18) కనిపించడం లేదని ఎస్‌ఐ ఘనమద్దిలేటి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. ఈ నెల 13న ఉదయం పాలకోసం బయటికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిందన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-12-16T05:18:32+05:30 IST