ఈతకు వెళ్లి బాలుడు మృతి
ABN , First Publish Date - 2020-12-14T04:51:40+05:30 IST
మండల పరిధిలోని కేతరాచపల్లె పక్కనే ఉన్న రాజులమడుగులో ఆదివారం ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందాడు.

పుల్లంపేట, డిసెంబరు13 : మండల పరిధిలోని కేతరాచపల్లె పక్కనే ఉన్న రాజులమడుగులో ఆదివారం ఈతకు వెళ్లి ఓ బాలుడు మృతి చెందాడు. వత్తలూరు అగ్రహారానికి చెందిన వద్ది భరత్(13) తన మేనమామ స్వగ్రామమైన కేతరాచపల్లె గ్రామానికి మూడు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న రాజులమడుగులో ఈతకు వెళ్లాడు. మడుగులో లోతు ఎక్కువగా ఉండటం, దీనికితోడు ఈత రాకపోవడంతో మృతి చెందాడు. పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.