జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు
ABN , First Publish Date - 2020-12-14T04:55:36+05:30 IST
పట్టణంలోని ఆర్.ఎ్‌స.అకాడమీలో 12,13వతేదీలో నిర్వహించిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి.

రైల్వేకోడూరు రూరల్, డిసెంబరు 13: పట్టణంలోని ఆర్.ఎ్‌స.అకాడమీలో 12,13వతేదీలో నిర్వహించిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలో జిల్లా నుంచి 100 మంది క్రీడాకార ులు పాల్గొన్నట్లు జిల్లా కార్యదర్శి మాస్టర్ రవిశంకర్ రాజు తెలిపారు. ఈ పోటీలో జూనియర్, సబ్‌జూనియర్, సీనియర్ బాల బాలికలు పాల్గొన్నారు. ప్రథయ స్థానం రైల్వేకోడూరు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ద్వితీయ స్థానంలో రాజంపేట, తృతీయ స్థానంలో ప్రొదుటూరు విద్యార్థులు నిలిచారు. గెలుపొందిన విద్యార్థులు ఈ నెల 26,27,28 వ తేదీలో వైజాగ్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని స్కూల్‌గేమ్ సెక్రటరీ సి.శారద తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆనంద్ ఆచారి, ట్రెజరర్ ఆర్.మునీశ్వర్, కోచ్ ఎస్.కె.మౌలా, పెంచల్ రాజు తదితరుల పాల్గొన్నారు.