చెక్‌పోస్టు వద్ద బందోబస్తు

ABN , First Publish Date - 2020-04-07T09:15:43+05:30 IST

స్థానిక శనేశ్వరం పోలీసు చెక్‌పోస్టు వద్ద స్థానిక ఎస్‌ఐ రాజగోపాల్‌ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర

చెక్‌పోస్టు వద్ద బందోబస్తు

వల్లూరు, ఏప్రిల్‌ 6: స్థానిక శనేశ్వరం పోలీసు చెక్‌పోస్టు వద్ద స్థానిక ఎస్‌ఐ రాజగోపాల్‌ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు చేతులెత్తి నమస్కరిస్తూ మీరు మీ ఇంటి వద్దనే ఉంటే కరోనాను తరిమికొట్టవచ్చని, దయచేసి మీరు ఇంటికి వెళ్లాలని వారికి సలహాలు, సూచనలు అందించారు. ఇప్పటికే గ్రామాల్లో ఆటోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని, దయచేసి చెక్‌పోస్టు దాటకుండా ఇంటికి వెళ్లాలని సూచించారు.

Read more