బ్లాస్టింగ్‌తో పంటలు దెబ్బతింటున్నాయి...

ABN , First Publish Date - 2020-12-07T04:48:50+05:30 IST

మండలంలోని నవాబుపేట గ్రామ సమీపాన ఉన్న దాల్మియా పరిశ్రమ యాజమాన్యం రాయి కోసం చేసే బ్లాస్టింగ్‌తో రాళ్లు, దుమ్ము దూళి పడి పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్లాస్టింగ్‌తో పంటలు దెబ్బతింటున్నాయి...
పంట పొలాల్లోనే టెంట్‌ వేసి నిరసన తెలుపుతున్న రైతులు

పొలంలోనే రైతుల నిరసన


మైలవరం, డిసెంబరు 6 : మండలంలోని నవాబుపేట గ్రామ సమీపాన ఉన్న దాల్మియా పరిశ్రమ యాజమాన్యం రాయి కోసం చేసే బ్లాస్టింగ్‌తో రాళ్లు, దుమ్ము దూళి పడి పంట పొలాలు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గత రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు. దీంతో గత్యంతరం లేక ఆదివారం తమ పొలాల వద్ద కూర్చుని నిరసన తెలిపారు. మా పొలాలను కొనుగోలు చేసి మా కుటుంబంలో ఒకరికి పరిశ్రమలో ఉద్యోగావకాశం కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. బ్లాస్టింగ్‌ చేసినప్పుడు రాళ్లు, దుమ్ము, దూళి పడకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామ మాజీ సర్పంచ్‌ రఘునాథరెడ్డి, నాయకులు యర్రబోలు రామమోహన్‌రెడ్డి, యర్రబోలు భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి తదితరులు మద్దతు తెలిపారు.

 

Updated Date - 2020-12-07T04:48:50+05:30 IST