అభివృద్ధి మనది.. అవినీతి వారిది

ABN , First Publish Date - 2020-12-29T06:05:26+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ అల్లుడు లోకే్‌షకుమార్‌ సోమవారం సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు.

అభివృద్ధి మనది.. అవినీతి వారిది
లోకేష్‌కు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సోము వీర్రాజు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 

బీజేపీలో చేరిన లోకేష్‌కుమార్‌

రాజంపేట, డిసెంబరు 28 : కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ అల్లుడు లోకే్‌షకుమార్‌ సోమవారం సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ గార్డెన్సలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలనపై విసుగెత్తి రాష్ట్ర ప్రజలు 151 సీట్లు అందిస్తే తమ వద్ద ఉన్న వైసీపీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిగా కుటీర పరిశ్రమగా భూం..భూం... బీర్లు తయారు చేసి వాటి ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. రాష్ట్రంలో అటు చంద్రబాబునాయుడు, ఇటు జగనమోహనరెడ్డి కుటుంబాలు రాజ్యమేలుతున్నాయని వచ్చే ఎన్నికల్లో ఈ కుటుంబ పాలనకు స్వస్తిపలికి ప్రజలు బీజేపీకి అధికారం అప్పజెప్పనున్నారని జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేసి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం తధ్యమన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రధాని నరేంద్రమోదీ పేరు లేకుండా చేసి వాటిని పేర్లు మార్చి అన్నీ తనవిగా జగనమోహనరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని తూర్పారబట్టారు. జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇనచార్జి సునీల్‌థియోధర్‌ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చి అక్కడే కొందరికి క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు తెలిపారని వెంటనే అతన్ని క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, నాగోతు రమే్‌షనాయుడు, అధికార ప్రతినిధి కోలా ఆనంద్‌, మైనారిటీ నాయకులు షేక్‌ బాజీ, కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడుతూ జగన ప్రభుత్వం రాషా్ట్రన్ని అవినీతిమయంగా మార్చిందని వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. రాజంపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ పోతుగుంట రమే్‌షనాయుడు, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు పట్టుపోగుల ఆదినారాయణ, రాష్ట్ర కిస్సాన మోర్చా అధ్యక్షుడు చెంగల్‌రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వై.సురే్‌షరాజు, పులి నరేంద్రధర్‌రెడ్డి, ప్రశాంత, నందలూరు జిల్లా పరిషత మాజీ సభ్యుడు షబ్బీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. 


లోకే్‌షకుమార్‌ బీజేపీలో చేరిక 

కేంద్ర మాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్‌ అల్లుడు లోకేష్‌ కుమార్‌ సోమవారం బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు రాజంపేట పట్టణం మన్నూరు యల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాజంపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలోకేష్‌ మాట్లాడుతూ తాను నరేంద్రమోదీ నాయకత్వానికి ఆకర్షితులై బీజేపీలో చేరానని, బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని తెలిపారు. 

Updated Date - 2020-12-29T06:05:26+05:30 IST