కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం కల్పించండి

ABN , First Publish Date - 2020-11-08T05:13:36+05:30 IST

కార్యకర్తలు కృషి చేయాలని భారతీయ కిసాన్‌ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

కేంద్ర పథకాలపై విస్తృత ప్రచారం కల్పించండి
మాట్లాడుతున్న శశిభూషణ్‌రెడ్డి

బీజేపీ నియోజకవర్గ శిక్షణ తరగతుల్లో కిసాన్‌ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి

ప్రొద్దుటూరు అర్బన్‌, నవంబర్‌ 7: కేంద్ర ప్రభుత్వ పఽథకాల పై విస్తృత ప్రచారం కల్పించి వాటిని ప్రజలకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని  భారతీయ కిసాన్‌ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం స్థాని క సరస్వతి విద్యామందిరంలో జరుగుతున్న రెండురోజుల బీజేపీ నియోజకవర్గ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సర్వశిక్షా అభియాన్‌, అంగన్‌ వాడీ, ఎస్సీ, ఎస్టీలకు వాహనాలపై ఇచ్చే రుణాలు తదితర పథ కా లకు  కేంద్రం 60 శాతం నిధులు  ఇస్తుండగా పనికి ఆహార పఽథకానికి 100 శాతం నిధులు చెల్లిస్తోందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని తమ పఽథకాలుగా  చెప్పుకుంటోంద ని విమర్శించారు. అంగన్‌వాడీలకు సరఫరా చేసే గుఢ్ల కాం ట్రాక్టు కూడా ఓ మంత్రి సోదరుడు తీసుకొని దోపిడికి పాల్ప డుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ జిల్లా  అధ్యక్షు డు ఎల్లారెడ్డి మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ప్రధానమం త్రి స్వానిధి పఽథకం  కింద రుణాలు మంజూరు చేస్తున్నద న్నారు. నియోజకవర్గ నేత గొర్రెశీనువాసులు మాట్లాడుతూ వ్యవసాయ బిల్లు ద్వారా రైతులకు గిట్టుబాటుధర వచ్చి దేశంలో వారి ఉత్పత్తులు ఎక్కడైన విక్రయించుకొనే అవకా శం కల్పించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షు లు సుబ్రమణ్యం, భాస్కర్‌రెడ్డి, నరేష్‌, రఘురామిరెడ్డి, మహిళా మోర్చనేత విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-08T05:13:36+05:30 IST