పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
ABN , First Publish Date - 2020-12-14T04:58:28+05:30 IST
జిల్లాలో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనం వెంటనే చెల్లిచాలని ఆ పథకం వంట ఏజన్సీల రాష్ట్ర నాయకుడు ఎస్.ముజఫర్ అహ్మమద్ డిమాండ్ చేశారు.

నందలూరు, డిసెంబరు13 : జిల్లాలో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనం వెంటనే చెల్లిచాలని ఆ పథకం వంట ఏజన్సీల రాష్ట్ర నాయకుడు ఎస్.ముజఫర్ అహ్మమద్ డిమాండ్ చేశారు. ఆదివారం నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట ఏజన్సీ ల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సులోచనమ్మ, ప్రధాన కార్యదర్శి మేరీ, రాజంపేట మండల అధ్యక్షుడు డి.బాబు, పెనగలూరు మండల అధ్యక్షుడు వెంగగురుడు, నందలూరు మండల నాయకులు పి.సాంబశివ, రమేష్, ఆదినారాయణ పాల్గొన్నారు.