భూసర్వేకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2020-12-16T04:49:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న భూసర్వేకు తహసీల్దార్‌ కార్యాలయంపై కార్‌బేస్‌ స్టేషన్‌ సిద్ధమైందని తహసీల్దార్‌ శ్రావణి పేర్కొన్నారు.

భూసర్వేకు సర్వం సిద్ధం
తహసీల్దార్‌ కార్యాలయంపై భూసర్వేకు కార్‌ బేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసిన దృశ్యం

గాలివీడు, డిసెంబరు15: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న భూసర్వేకు తహసీల్దార్‌ కార్యాలయంపై కార్‌బేస్‌ స్టేషన్‌ సిద్ధమైందని తహసీల్దార్‌ శ్రావణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె తహసీల్దార్‌ కార్యాలయంలో మాట్లాడుతూ ఇలాంటి కార్‌ బేస్‌ స్టేషన్లు జిల్లాలో ఐదు ఏర్పాటు చేశారని, గాలివీడు, పుల్లంపేట, పులివెందుల, ఖాజీపేట, పెద్దముడియం మండలాల్లో సిద్ధం చేశారన్నారు. వీటి ద్వారా దాదాపు 40 కిలోమీటర్ల పైబడి భూసర్వే నిర్వహించవచ్చునని జిల్లాలో ప్రధమంగా చెన్నూరు మండలం కొక్కిరాయపల్లెలో ఈ నెల 21న భూసర్వే ఆరంభమవుతుందన్నారు. గాలివీడు మండలంలో మొట్టమొదటగా ఎగువగొట్టివీడు గ్రామంలో భూసర్వే నిర్వహించనున్నారని, అనంతరం అన్ని గ్రామాల్లో భూసర్వే చేపట్టనున్నారన్నారు. అనంతరం ఆమె బీఎల్‌వోలతో ఓటరు నమోదు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ తిమ్మారెడ్డి, ఆర్‌ఐ చంద్రశేఖర్‌, సర్వేయర్‌ బాలాజీ, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-16T04:49:57+05:30 IST