ఆడపిల్లలను సంరక్షించుకుందాం

ABN , First Publish Date - 2020-11-22T04:28:26+05:30 IST

ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందని, ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైద్యాధికారి డాక్టర్‌ వాసుదేవరెడ్డి పేర్కొన్నారు.

ఆడపిల్లలను సంరక్షించుకుందాం
వైద్యసిబ్బందికి అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ వాసుదేవరెడ్డి

గోపవరం, నవంబరు 21: ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందని, ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైద్యాధికారి డాక్టర్‌ వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. శనివారం గోపవరం సచివాలయంలో భేటీ బచావో, భేటీ పడావో గురించి వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ భ్రూ ణహత్యలు నివారించి ఆడపిల్లలను సంరక్షించుకోవాలని, వీరిని మగపిల్లల్లాగా చూసుకుంటూ విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భేటీ బచావో, భేటీ పడావోను ప్రవేశపెట్టిందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేసి ఈ పథకం సద్వినియోగం చేసుకునేలా గ్రామీణ ప్రాంతీయులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీహెచఓ గౌస్‌, మల్లికార్జునరెడ్డి, సుబ్బారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Read more