భవన నిర్మాణ కార్మికుల కడుపుకొట్టవద్దు

ABN , First Publish Date - 2020-11-08T05:04:14+05:30 IST

ఇసుక, మట్టిపై ప్రభుత్వం నిషేధం విధించి కడుపుకొట్టవద్దని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

భవన నిర్మాణ కార్మికుల కడుపుకొట్టవద్దు

గాలివీడు, నవంబరు 7: ఇసుక, మట్టిపై ప్రభుత్వం నిషేధం విధించి కడుపుకొట్టవద్దని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సంకల్పయాత్రకు గాలివీడుకు డిప్యూటీ సీఎం అంజద్‌బాష, ఎంపీ మిధున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి వచ్చిన సమయానికి భవన నిర్మాణ కార్మికులు ర్యాలీగా గేటు వరకు వచ్చారు. ఇసుక, మట్టిపై నిషేధం తొలగించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వం ఇసుకపై కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని, దీని వల్ల  ఎలాంటి ఇబ్బందులు ఉండవని నాయకులు తెలిపారు. 

Updated Date - 2020-11-08T05:04:14+05:30 IST