-
-
Home » Andhra Pradesh » Kadapa » Bharath Bundh
-
భారతబంద్‌కు కాంగ్రెస్ మద్దతు
ABN , First Publish Date - 2020-12-07T04:25:46+05:30 IST
భారత్ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రకటించారు.

వేంపల్లె, డిసెంబరు 6: రైతులకు మద్ధతుగా నిర్వహిస్తున్న భారత్ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రకటించారు. కేం ద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమని, వీటి ని ఉపసంహరించుకోవాలని ఆయన మీడియా సమావే శంలో డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు సంఘాల కార్యచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 8న జరగనున్న భారతబంద్‌కు కాంగ్రెస్ మద్ధతు ఇస్తుందన్నారు. ఇలాంటి చట్టాలకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతు లు చేస్తున్న ధర్నా మరో స్వాతంత్య్ర ఉద్యమమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ద్రువకుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, నరసింహారెడ్డి, ఉత్తన్న, సుబ్బరా యుడు, సత్తార్, రామయ్య తదితరులు పాల్గొన్నారు.