ఎస్‌ఐ చిరంజీవికి బంగారు పతకాలు

ABN , First Publish Date - 2020-12-16T04:59:16+05:30 IST

డ్యూటీ మీట్‌లో భాగంగా కర్నూలు రేంజ్‌లో మంగళవారం జరిగిన పోటీల్లో పులివెందుల పులివెందుల ఎస్‌ఐ చిరంజీవి రెండు బంగారు పతకాలు సాధించారు.

ఎస్‌ఐ చిరంజీవికి బంగారు పతకాలు
కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా గోల్డ్‌మెడల్‌ అందుకుంటున్న ఎస్‌ఐ చిరంజీవి

పులివెందుల టౌన్‌, డిసెంబరు 15: డ్యూటీ మీట్‌లో భాగంగా కర్నూలు రేంజ్‌లో మంగళవారం జరిగిన పోటీల్లో పులివెందుల పులివెందుల ఎస్‌ఐ చిరంజీవి రెండు బంగారు పతకాలు సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో ఎస్‌ఐ ఉత్తమ ప్రతిభ కనబరచి పతకాలు పొందారు. కడప, కర్నూలు ఎస్పీల ఆధ్వర్యంలో కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ వెంకటరామిరెడ్డి చేతుల బంగారు పతకాలు అందుకున్నారు.

Updated Date - 2020-12-16T04:59:16+05:30 IST