అనవసరంగా బయట తిరిగేవారిపై కఠినంగా వ్యవహరించండి

ABN , First Publish Date - 2020-04-28T05:30:00+05:30 IST

కరోనాను కట్టడి చేసేందుకు సిబ్బందితో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అనవసరంగా బయట తిరిగే వారిపై

అనవసరంగా బయట తిరిగేవారిపై కఠినంగా వ్యవహరించండి

వెల్ఫేర్‌ అడిషినల్‌ ఇన్‌చార్జి డీజీపీ శ్రీధర్‌రావు


కడప (క్రైం), ఏప్రిల్‌ 27 : కరోనాను కట్టడి చేసేందుకు సిబ్బందితో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అనవసరంగా బయట తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారి వాహనాలను సీజ్‌ చేయాలని సిబ్బందిని వెల్ఫేర్‌ అడిషనల్‌ ఇన్‌చార్జి డీజీపీ శ్రీధర్‌రావు ఆదేశించారు. కడప నగరం పోలీసు గెస్ట్‌హౌ్‌సలో సోమవారం జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రజలే స్వచ్ఛందంగా భౌతిక దూరం పాటించడంతో పాటు కొత్త వ్యక్తులను తాకకూడదన్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో పోలీసు సిబ్బందితో పాటు వైద్య, శానిటేషన్‌ సిబ్బంది తగు జాగత్త్రలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల జిల్లాలో కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో వారి ప్రస్తుత ఆరోగ్య స్థితి, వారి కుటుంబయోగక్షేమాలపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.


అనంతరం కరోనా వైరస్‌ కట్టడికి తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్‌, సరిహద్దు చెక్‌పోస్టులు తదితర విషయాలపై అధికారులతో చర్చించినుట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-28T05:30:00+05:30 IST