‘నివర్‌’తో అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2020-11-26T04:15:24+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాధ తెలిపారు.

‘నివర్‌’తో అప్రమత్తంగా ఉండండి
సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ రాధ

ప్రొద్దుటూరు, నవంబరు 25 : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాధ తెలిపారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం వార్డు సచివాలయ సిబ్బందితో అమె సమావేశమయ్యారు. రాబోవు రెండు రోజుల్లో నివర్‌ తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న గృహాలు, కల్వర్టులు, పూరిగుడిసెలు, రోడ్డుపక్కన టెంట్లు వేసుకుని నివశించే వారిని గుర్తించాలని ఆదేశించారు. అలాంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాల్సిందిగా సూచించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రతి సచివాలయంలో వార్డు ఆడ్మిన్లు, వీఆర్‌వోలు, సెక్రటరీలు ఫోన్‌ నెంబర్లు డిస్‌ప్లేలో ఉంచాలని ఆదేశించారు. ఈ మూడు రోజులు ప్రజలకు సచివాలయాల సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పునరావాస కేంద్రాలు, ఆవసరమైన ఆహార పానీయాలను సచివాలయాల సిబ్బంది ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నారు. పురపాలక సంఘం నుంచి వాటిని సరఫరా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీపీవో రఘురాం, పీపీఎస్‌ ఇందిర తదితరులు పాల్గొన్నారు. 


గ్రామాల్లో అలర్ట్‌

రాజుపాళెం, నవంబరు 25: నివర్‌ తుపాన్‌ ప్రభావం జిల్లాపైన ఎక్కువగా ఉంటుందని తెలియడంతో స్పెషల్‌ ఆపీసర్‌ రాజశేఖర్‌ ఆదేశాల మేరకు గ్రామాల్లో  ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రంగా టంగుటూరు జడ్పీ హైస్కూల్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-11-26T04:15:24+05:30 IST