రైల్వేకోడూరులో బ్యానర్ల కలకలం

ABN , First Publish Date - 2020-08-18T11:46:59+05:30 IST

రైల్వేకోడూరు, ఆగస్టు, 17: నియోజకవర్గ టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌ జన్మదిన వేడుకల సందర్భంగా రైల్వేకోడూరు పట్టణంలో భారీ ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు.

రైల్వేకోడూరులో బ్యానర్ల కలకలం

 రైల్వేకోడూరులో బ్యానర్ల కలకలం


రైల్వేకోడూరు, ఆగస్టు, 17: నియోజకవర్గ టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌ జన్మదిన వేడుకల సందర్భంగా రైల్వేకోడూరు పట్టణంలో భారీ ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇది చూసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం స్థానిక టోల్గేట్‌ వద్ద పంతగాని పెద్ద బ్యానర్‌ను చించేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని బ్యానర్లు చించుతున్నవారిని అడ్డుకోవడంతో కొంత ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

సమాచారం తెలుసుకున్న రైల్వేకోడూరు పోలీసులు రంగప్రవేశం చేశారు. అయినా వైసీపీ కార్యకర్తలు మరో బ్యానర్‌ను చించివేయడానికి ప్రయత్నించారు. దీంతో టీడీపీ కార్యకర్త రాజగోపాల్‌, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా యువత అధ్యక్షుడు బొక్కసం సునీల్‌, యువ నాయకుడు కస్తూరి దినేష్‌ మాట్లాడుతూ వైసీపీ అరాచకాలు మితిమీరిపోతున్నాయని తెలిపారు. వైసీపీ దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తి లేదన్నారు.

Updated Date - 2020-08-18T11:46:59+05:30 IST