పేద విద్యార్థులకు అటల్ టింకరింగ్ ల్యాబ్ వరం
ABN , First Publish Date - 2020-12-31T05:08:50+05:30 IST
నిరుపేద విద్యార్థులకు అటల్ టింకరింగ్ ల్యాబ్ వరం లాంటిదని డిప్యూటీ డీఈవో రంగారెడ్డి పేర్కొన్నారు.

లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు30: నిరుపేద విద్యార్థులకు అటల్ టింకరింగ్ ల్యాబ్ వరం లాంటిదని డిప్యూటీ డీఈవో రంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విశ్వభారతి పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటల్ టింకరింగ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో చక్రేనాయక్, డైరెక్టర్ రామచంద్రయ్య, కరస్పాండెంట్ రఘునాథరాజు, హబీబ్, కొండూరు గంగరాజు, రవి, హరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.