ప్రాథమిక దశలోనే ఉన్నత ఆలోచనలకు బీజం

ABN , First Publish Date - 2020-03-02T10:19:37+05:30 IST

ప్రతి విద్యార్థికి పాఠశాల స్థాయిలోనే ఉన్నత ఆలోచనలకు బీజం పడుతుందని తెలంగాణ డీజీపీ మహేం దర్‌ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌

ప్రాథమిక దశలోనే ఉన్నత ఆలోచనలకు బీజం

చింతచెట్టు కింది చదువే.. రాష్ట్ర డీజీపీ స్థాయి.. 

తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి 

ఘనంగా ముగిసిన జెడ్పీ పాఠశాల శతజయంతి ఉత్సవాలు


బద్వేల్‌, మార్చి1: ప్రతి విద్యార్థికి పాఠశాల స్థాయిలోనే ఉన్నత ఆలోచనలకు బీజం పడుతుందని తెలంగాణ డీజీపీ మహేం దర్‌ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ముగింపు కార్య క్రమానికి ఆయన  విశిష్ఠ అతిథిగా హాజర య్యారు. ముందుగా శతజయంతి ఉత్సవా ల స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడు తూ బాల్యంలో మంచి చెడులు చెప్పి విద్యాబుద్దులు నేర్పే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి ఉన్నత స్థానాలకు చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. తాను కూడా ఓ కుగ్రామంలో చింత చెట్టు కింద విద్యను అభ్యసించానని, 6, 7వ తరగతులు దగ్గరలోని పట్టణంలో, 8 నుంచి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో, ఆ తరువాత వెనుతిరగకుండా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర డీజీపీ స్థాయిలో అంచలంచలగా చేరుకున్నారన్నారు. కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మనిషికి విద్య నిజమైన ఆభరణమని, విద్యనేర్పిన గురువులను మనం ఏ స్థాయిలో ఉన్నా మరిచిపోకూడదన్నారు.


ఉదయగిరి ఎమ్మెల్యే మేకటిపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తాను పక్క జిల్లాకు చెందినవాడినైనప్పటికీ ఈ పాఠశాల నుంచే ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఈ స్థాయికి చేరానన్నారు. పూర్వవిద్యార్థి మాజీ ఎమెల్యే డాక్టర్‌ శివరామకృష్ణారావు మాట్లాడుతూ తాము చదివే రోజుల్లో ఉపాధ్యాయులు కఠినంగా వ్యవహరించి విద్యనేర్పించేవారని, ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నామంటే అది ఆనాటి గురువులు నేర్పించిన ఉన్నత విలువలేనన్నారు. పాఠశాల పూర్వవిద్యార్థి, ఆర్జీయూకేటీ చాన్సలర్‌ కేసీ రెడ్డి మాట్లాడుతూ తన సొంత గ్రామం పుటాయపల్లి నుంచి ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఈ పాఠశాలలో విద్యను అభ్యసించానన్నారు. పాఠశాల స్థాయిలో వారు నేర్పిన క్రమశిక్షణ, నైతిక విలువలే తాను ఈ స్థాయికి చేరేందుకు దోహదపడ్డాయన్నారు. అనంతరం పాఠశాల పూర్వ విద్యార్థుల సంగీత విభావరీ పలువురిని ఆకట్టుకుంది. 


కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు తెలంగాణ ఆగ్రో చైర్మన్‌ ఎంసీ రాజమోహన్‌, పీవీఎన్‌ ప్రసాద్‌, న్యాయవాది చంద్ర ఓబులరెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు భూమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నాగిరెడ్డి శంకర్‌రెడ్డి, కేవీ సుబ్బారావు, సోమెశిల పార్థసారది, ఆవుల శ్రీనివాసులు, గంగసాని సాంబశివారెడ్డి, కత్తి బ్రహ్మయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు గజేంద్రనాథరెడ్డి, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T10:19:37+05:30 IST