ఇరువురు గుట్కా వ్యాపారుల అరెస్టు

ABN , First Publish Date - 2020-03-15T10:42:59+05:30 IST

ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్ధాలైన పొగాకు, గుట్కా అక్ర మ రవాణా చేస్తున్న ఇరువురిని చిన్నచౌకు పో లీసులు పాత

ఇరువురు గుట్కా వ్యాపారుల అరెస్టు

రూ.2.50 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం


కడప (క్రైం), మార్చి 14: ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్ధాలైన పొగాకు, గుట్కా అక్ర మ రవాణా చేస్తున్న ఇరువురిని చిన్నచౌకు పో లీసులు పాత బైపాస్‌ వద్ద అరెస్టు చేశారు. శనివారం కడప డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ సీఐ అశోక్‌రెడ్డితో కలిసి నిం దితుల వివరాలను వెల్లడించారు. ఎర్రముక్కపల్లెలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన రామిరెడ్డి మో హన్‌రెడ్డి, రాజారెడ్డివీధి చెందిన గొడుగు శివకుమార్‌ కలిసి ఇతర రాష్ట్రం నుంచి ప్రభుత్వం నిషేధించిన గుట్కా ఖైనీ, రాజా పాన్‌మసాలా వంటివి తీసుకువచ్చి వాటిని ఇతర ప్రాంతాలకు చెందిన చిరు వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు.


ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు చిన్నచౌకు సీఐ, అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు రోషన్‌, సత్యనారాయణ సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా రూ.2.50 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, వెయ్యి రూపాయల నగదు స్వాఽధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుట్కా వ్యాపారులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Updated Date - 2020-03-15T10:42:59+05:30 IST