టిప్పర్‌ దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2020-11-07T06:33:35+05:30 IST

కలమల్ల పోలీసుస్టేషన పరిధిలో 4వ తేదీన చోరీకి గురైన టిప్పర్‌ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉలసయ్య, ఎస్‌ఐ చంద్రమోహనలు తెలిపారు.

టిప్పర్‌ దొంగలు అరెస్టు

ఎర్రగుంట్ల, నవంబరు 6: కలమల్ల పోలీసుస్టేషన పరిధిలో 4వ తేదీన చోరీకి గురైన టిప్పర్‌ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉలసయ్య, ఎస్‌ఐ చంద్రమోహనలు తెలిపారు. శుక్రవారం కొండాపురం మండలంలోని వెంకటాపురం గ్రామం సమీపంలోని హైవే నందు ఈ టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని కలమల్లకు చెందిన షేక్‌ ఖాదర్‌బాషా, పులివెందులకు చెందిన పాండురంగనాయకులను అరెస్టుచేసినట్లు పేర్కొన్నారు. నిందితులను కొర్టుకు హాజరు పరచినట్లు పేర్కొన్నారు. టిప్పర్‌ను పట్టుకోవడంలో కలమల్ల ఏఎస్‌ఐ మగ్బుల్‌,  హెడ్‌కానిస్టేబుల్‌ రమణారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీకాంత, నాథానియల్‌ తదితరులు 

పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-07T06:33:35+05:30 IST